తాజా వార్తలు

Saturday, 4 June 2016

విద్యుత్‌ శాఖ గెస్ట్‌హౌస్‌లో రాసలీలలు..


బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ అధికారి గెస్ట్ హౌస్‌లో మహిళతో సరసాలాడుతూ.. పోలీసులకు చిక్కాడు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) చింతూరు ఏడీఈ మధుసూదనరావు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో మహిళతో రాసలీలలాడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాలు.. మధుసూదనరావు శ్యామలానగర్‌లోని పాత సోమాలమ్మ గుడి సమీపంలో ఉన్న ఏపీ పవర్ డిప్లమో ఇంజనీర్స్ అసోసియేషన్ గెస్ట్‌హౌస్‌లో ఒక మహిళతో ఉండగా శనివారం పట్టుబడ్డాడు.

దీంతో పోలీసులు అతన్ని విచారించగా.. మోహన్ అనే కాంట్రాక్టర్ రూమ్ బుక్ చేశాడని.. పని ఉంది రమ్మంటే తాను వచ్చానని బుకాయించడానికి యత్నించాడు. కాగా శుక్రవారం రాత్రి అదే గదిలో మరో యువతితో గడిపినట్టు పోలీసులు సాక్ష్యాలతో సహా చెప్పేసరికి గతుక్కుమన్నాడు. మధుసూదనరావుతో పాటు అతనితో ఉన్న మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని వారిని కోర్టుకు తరలిస్తామని తెలిపారు. కాగా మధుసూదనరావు గతంలో రెండుసార్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
« PREV
NEXT »

No comments

Post a Comment