తాజా వార్తలు

Saturday, 18 June 2016

ఫోన్‌ ట్యాపింగ్‌ కలకలం…!

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం దేశంలో కలకలం రేపుతోంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఎస్సార్‌ గ్రూప్‌ దేశంలో ప్రముఖుల ఫోన్‌లు ట్యాప్‌ చేసిందనే ఆరోపణలతో పెద్ద సంచలనమే రేగింది. ఢిల్లీకి చెందిన న్యాయవాది సురేన్‌ ఉప్పల్‌ ఆధారాలతో సహా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఎస్సార్‌ గ్రూప్‌ యాజమాన్యం ఆదేశాల మేరకు ఆల్‌ బాసీత్‌ ఖాన్‌ ఫ్యోన్‌ టాపింగ్‌లకు పాల్పడినట్టు ఆయన ఆరోపిస్తున్నారు. ఆధారాలతో సహా న్యాయవాది సురేన్‌ ప్రధానికి ఫిర్యాదు చేశారు.
సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారుల ఫోన్లను ఎస్సార్‌ గ్రూప్‌ ట్యాప్‌ చేసింది. పీఎంవో కార్యాలయంతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, అంబానీ సోదరులు వంటి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, ప్రైవేట్, పబ్లిక్‌ బ్యాంక్‌ మేనేజర్లు, అమితాబ్‌ లాంటి సినీ స్టార్స్‌, రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్‌ చేశారు.
గతంలో హచ్‌ పేరుతో టెలికామ్‌ కంపెనీని ఎస్సార్‌ గ్రూపు నడిపింది. ఆ తరువాత వోడాఫోన్‌కు దానిని విక్రయించారు. ఈ విక్రయానికి ముందు 2001 నుంచి 2006 వరకు ఈ ట్యాపింగ్‌ జరిగినట్టు న్యాయవాది ఆరోపించారు. అయితే ఎస్సార్‌ కంపెనీ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.
« PREV
NEXT »

No comments

Post a Comment