తాజా వార్తలు

Monday, 13 June 2016

రాష్ట్ర అభివృద్ది కోసమే టీఆర్‌ఎస్‌లోకి…

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు మాజీ ఎంపీ వివేక్‌… అభివృద్ధి కోసమే టీఆర్ఎస్‌లో చేరుతున్నామన్నారు. తమ తండ్రి ఆశయసాధనకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామన్నారాయన. రెండేళ్లుగా ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు టీఆర్ఎస్‌పై పూర్తి విశ్వాసాన్ని చూపిస్తున్నారని… అన్నీ గమనించాకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్‌లో చేరడానికి సిద్ధమయ్యామన్నారు వివేక్‌.

తెలంగాణ సాధన కోసం చివరి వరకు మా వంతు పాత్ర పోషించాం. అందులో భాగంగానే అప్పట్లోనే టీఆర్ఎస్‌లో చేరాం. అయినా కూడా తెలంగాణ ఇస్తే పార్టీకి తిరిగొస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్‌కు తిరిగి వచ్చామని తెలిపారు వివేక్‌. ఎన్నికలకు ముందు పార్టీ మారితే రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా అన్నింటికీ సిద్ధపడి మాట మీద నిలబడ్డామని చెప్పారు వివేక్‌.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సోనియాగాంధీకి ఎప్పటికీ రుణపడి ఉంటాం… సోనియా చేసిన మేలును జనం, మా కుటుంబం ఎప్పటికీ మరిచిపోం అన్నారు వివేక్. తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో మా వంతు పాత్ర పోషించాలని అనుకుంటున్నాం. అందుకే టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

నాన్నగారి స్వప్నాన్ని … 50 ఏళ్లుగా ఆయన చేసిన పోరాటాన్ని మేం సాధించామన్నారు మాజీ మంత్రి వినోద్‌. బలహీన వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు తెలిపారు. వీకర్ సెక్షన్‌లో సమస్యలను సీఎం దగ్గరకు తీసుకువెళతామన్నారు వినోద్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment