తాజా వార్తలు

Saturday, 11 June 2016

ముద్రగడది వితండ వాదం…!

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకునేది లేదంటున్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. కాపుల కోసం ఉద్యమం చేస్తున్నానని కబుర్లు చెబుతున్న ముద్రగడ పద్మనాభం… ప్రతిపక్షం చేతిలో కీలుబొమ్మలా మారిపోయారని విమర్శించారు.
తుని ఘటనలో విధ్వంసానికి పాల్పడిన వారిని విడిచిపెట్టాలని ఆందోళనలు చేయడం దురదృష్టకరమన్నారు గంటా. తుని ఘటనలో విధ్వంసానికి ప్రోత్సహించినవారిని, పాలుపంచుకున్నవారిని, నేరుగా పాల్గొన్నవారిపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి గంటా.
ఆధారాలు పరిశీలించిన తర్వాత… పూర్తిగా నిర్ధారణకు వచ్చే తుని ఘటనలో నిందితులను అరెస్ట్‌లు చేశాం… ఈ ఘటనలో ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని చెప్పాల్సింది పోయి… ముద్రగడ వితండ వాదం చేయడం సరికాదన్నారు. సంఘ విద్రోహ శక్తులకు మద్ధతిస్తే… ముద్రగడను కూడా సంఘ విద్రోహిగా భావించాల్సి వస్తుందన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment