తాజా వార్తలు

Sunday, 12 June 2016

గోపీచంద్‌కు ‘ఆక్సిజన్’ టీమ్‌ బర్త్‌డే విషెస్‌…

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం ‘ఆక్సిజన్‌’. ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. జూన్ 12న హీరో గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ హీరో గోపీచంద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
ఈ సందర్భంగా దర్శకుడు ఎ.ఎం.జ్యోతికృష్ణ మాట్లాడుతూ… మా యాక్షన్ హీరో గోపీచంద్‌కు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఆయన హీరోగా మా బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఆక్సిజన్ చిత్రం ఇప్పుడు చివరి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు.

డిఫరెంట్ సబ్జెక్ట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర చాలా హైలైట్ గా ఉంటుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుంది. త్వరలోనే ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు జ్యోతికృష్ణ.
« PREV
NEXT »

No comments

Post a Comment