తాజా వార్తలు

Monday, 6 June 2016

హామీలు విస్మరించిన ప్రభుత్వం


రెండేళ్లయినా ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వంపై ఈనెల 8న జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రజలను కోరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలపై కర్నూలులో మూడవ పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందన్నారు. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి తదితర ఎన్నో హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఫిర్యాదుల కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment