తాజా వార్తలు

Monday, 13 June 2016

అంతర్గత సమస్యలతో కాంగ్రెస్‌ బలహీనమైంది..!

తెలంగాణ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామన్నారు పార్టీ మారుతున్న కాంగ్రెస్ నేతలు. బంగారు తెలంగాణసాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి నడుస్తామని ప్రకటించారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్.

అంతర్గత సమస్యలతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని… తనకు పార్టీలో ఎవరితోనూ విబేధాలు లేవన్నారు గుత్తా. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ సోనియాదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం తాను చిత్తశుద్ధితో పనిచేశానని స్పష్టం చేశారు. ఈ నెల 15న టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నానన్నారు గుత్తా.
« PREV
NEXT »

No comments

Post a Comment