తాజా వార్తలు

Wednesday, 29 June 2016

ఆ హీరోతో నా కెమిస్ట్రీ బాగా కుదిరింది

హీరోయిన్ గా తెలుగులోనే ఎంట్రీ ఇచ్చినప్పటికీ, తమిళ్ లో వరుస ఆఫర్లు రావడం, అవి సక్సెస్ అవ్వడంతో అక్కడే స్థిరపడిపోయింది హన్సిక. ఆమె తాజా చిత్రం మనిదన్ తమిళ్ లో ఇప్పుడు ఘన విజయం సాధించింది. దీనిపై మాట్లాడుతూ ఈ సినిమాలో తాను నటించిన గ్రామీణ యువతి పాత్ర తనకు మంచి పేరు తెచ్చిందని, హీరో ఉదయనిధితో ఈ సినిమాలో కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెప్పుకొచ్చింది ఈ భామ.

ఉదయనిధి, హన్సిక కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ఓకే ఓకే కూడా బాగా హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక భాష గురించి మాట్లాడుతూ.., “ఇప్పుడిప్పుడే తమిళ్ ను బాగా నేర్చుకుంటున్నానని, మరికొన్ని రోజుల్లో ఆ భాషను పూర్తిగా నేర్చుకుంటానని” ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
« PREV
NEXT »

No comments

Post a Comment