తాజా వార్తలు

Tuesday, 14 June 2016

తెలంగాణ అభివృద్ధిని ఆపడం ఎవరి వల్ల కాదు:హరీష్ రావు

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు పథకాలను అడ్డుకోవాలంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసిన విషయం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు మంత్రి హరీష్‌రావు. వరంగల్‌ జిల్లాలోని కడిపికొండలో మిషన్‌ కాకతీయ పనులను ప్రారంభించిన హరీష్‌రావు, ఏపీ ప్రభుత్వ వైఖరి నోటితో నవ్వి నోసటితో వెక్కిరించినట్టు ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి ఆప‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదని, చంద్రబాబువి బూట‌క‌పు మాట‌లని ఆ విషయం తెలంగాణ ప్రజ‌ల‌కు తెలుసని ఆయ‌న అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవ‌డం మానుకోవాలని ఆయన సూచించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment