తాజా వార్తలు

Saturday, 25 June 2016

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు…

మరో 72 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వివరించింది. 72 గంటల్లోనే అది అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయంది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇక తెలంగాణలోని వరంగల్‌ జిల్లా పాలకుర్తిలో ఇప్పటికే 12 సెంటిమీటర్ల వర్షం నమోదు కాగా, కరీంనగర్‌ జిల్లా మంథనిలో 11, గుండాల, కొణిజర్ల, అశ్వారావుపేటలో 7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
« PREV
NEXT »

No comments

Post a Comment