తాజా వార్తలు

Thursday, 30 June 2016

‘శంషాబాద్‌’లో హైఅలర్ట్‌

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్‌ కొనసాగుతోంది. విజిటింగ్‌ పాసుల జారీని రద్దు చేశారు. ముమ్మరంగా తనిఖీలు జరుపుతున్నారు. నగరంలో ఐఎస్‌ ఉగ్రవాదుల కలకలం నేపథ్యంలో విమానాశ్రయంలో బుధవారం హై అలర్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం కూడా దానిని కొనసాగించారు. జూలై ఆరో తేదీ వరకూ సందర్శకులను అనుమతించేది లేదని, విజిటింగ్‌ పాసుల జారీని నిలిపి వేశామని సీఐ మహేశ్‌ తెలిపారు. రెండు రోజు కూడా విమానాశ్రయంలో భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేశాయి. సీఐఎ్‌సఎఫ్‌, సీఆర్‌ఎఫీఎఫ్‌, ఆక్టోపస్‌ బలగాలతోపాటు స్థానిక పోలీసులు సీఐ మహేశ్‌ ఆధ్వర్యంలో వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డిపార్చర్‌, అరైవల్‌, వీఐపీ పార్కింగ్‌, కారు పార్కింగ్‌, కార్గో వంటి ప్రదేశాలను జల్లెడ పడుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment