తాజా వార్తలు

Thursday, 2 June 2016

ఓయూలో రేవంత్‌.. భట్టి, శ్రీధర్ బాబు అరెస్ట్!ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉస్మానియాలో గురువారం ప్రారంభమైన జనజాతర
సభకు తెలంగాణ టీడీపీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు యత్నించిన కాంగ్రెస్ నేతలు భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబులను ఓయూ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది.
అయితే ఉస్మానియా వర్సిటీలోకి రాజకీయ నేతలకు అనుమతి లేదని ఈ రోజు హైకోర్టు ఓయూ ఉన్నతాధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయస్థానం తీర్పును ధిక్కరించి జనజాతరకు రాజకీయ నేతలను విద్యార్థులు ఆహ్వానించడంతో ఉద్రికత్త పరిస్థితికి దారితీసింది.
« PREV
NEXT »

No comments

Post a Comment