తాజా వార్తలు

Friday, 10 June 2016

ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను డెలిట్‌ చేయాలన్న హిల్లరీ…!

ఎన్నికలు ఎక్కడ జరిగినా… ఎన్నికలే… మాటల తూటాలు, విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, కుంభకోణాలు, స్కామ్‌లు ఇలా ఏదున్నా… ఎన్నికల సమయంలోనే బయటికి తీసే ప్రయత్నాలు జోరుగా సాగుతాయి. ఎన్నికలు తెలంగాణలో జరిగినా… ఏపీలో జరిగినా… భారత్‌లో జరిగినా ఇదే తీరు. దీనికి ప్రపంచ పెద్దన్న అమెరికాలో కూడా మినహాయింపు ఏమీలేదు.

అమెరికా అధ్యక్ష ఎన్నిలు దగ్గర పడుతుండడంతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి హిల్లరీ క్లింటన్‌ అభ్యర్థిత్వం ఖరారైపోయింది. రిపబ్లికన్‌ పార్టీ నుంచి ఇప్పటికే డొనాల్డ్‌ ట్రంప్‌ తన బర్త్‌ కన్‌ఫార్మ్‌ చేసుకుని… డెమోక్రటిక్‌ పార్టీపై విమర్శలు గుప్తిస్తూనే ఉన్నారు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డాడు ట్రంప్‌.

మరో వైపు హిల్లరీ క్లింటన్‌… ట్విట్టర్‌ వేదికగా డొనాల్డ్‌ ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ను తన ట్విట్టర్‌ ఖాతా డెలిట్‌ చేసేయ్‌ అంటూ ట్వీట్‌ చేశారు హిల్లరీ. ఇది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ట్వీట్‌ను ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల మంది రీట్వీట్‌ చేశారు. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో అధికంగా రీట్వీట్‌ చేసిన ట్వీట్‌ ఇదేనని విశ్లేషకులు చేబుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment