తాజా వార్తలు

Thursday, 2 June 2016

‘హౌస్‌ఫుల్-3’ పై కేసు వేసిన గేయరచయిత…

శుక్రవారం విడుదలకు సిద్ధమవుతున్న ‘హౌస్ ఫుల్-3’ సినిమాకు కొత్త చిక్కు వచ్చింది. ఈ కథ తనదంటూ రైటర్, గేయ రచయిత ఫరూక్ బర్వేలి ఈ సినిమా దర్శకులపై కాపీ రైట్ యాక్ట్ కింద కేసు వేశారు. తాను రచించిన ‘తిగ్‌డాంబాజ్‌’ అనే కథను ఓసారి అక్షయ్‌కుమార్‌కి వినిపించానని, అయితే అప్పుడు నాతో తీస్తానని మాటిచ్చి, తరువాత ఈ కథను నిర్మాత సాజిద్‌ నదియాడ్‌వాలా, అక్షయ్‌ కలిసి ‘హౌస్‌ఫుల్‌-3’ కోసం వాడుకున్నారంటూ ఫిర్యాదు చేశారు.

కానీ ఈ కథ అక్షయ్ కుమార్ కు డైరక్ట్ గా వినిపించలేదంట, అతడి మేకప్ మ్యాన్ కు వినిపించినట్లు అతడు చెప్పడం విశేషం. మరి దీనిపై ‘హౌస్ ఫుల్’ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. అక్షయ్‌కుమార్‌, అభిషేక్‌ బచ్చన్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, లీసా హేడెన్‌, నర్గిస్‌ ఫక్రి, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తదితరులు ఈ సినిమాలో నటించారు. షాజిద్, ఫర్హాద్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్, కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది.
« PREV
NEXT »

No comments

Post a Comment