తాజా వార్తలు

Saturday, 11 June 2016

ముద్రగడ దీక్షపై హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్‌

ముద్రగడ దీక్ష నేపథ్యంలో పోలీసు ఆంక్షలపై ఆయన కుమారుడు బాలు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. దానిపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. జస్టిస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. కాగా, ముద్రగడను అరెస్టు చేసినట్లు చెబుతున్నా, ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదని.. కేవలం 144 సెక్షన్ అమలుచేస్తున్నట్లు మాత్రమే చెబుతున్నారని పిటిషన్‌లో చెప్పారు. జిల్లాలో పోలీసు బందోబస్తు తీవ్రంగా పెట్టి భయాందోళనలకు గురి చేస్తున్నారని, కనీసం పిల్లలను స్కూళ్లకు కూడా వెళ్లనివ్వడం లేదని తెలిపారు.

బంధువులను కూడా తమ ఇంటికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని, రాజ్యాంగం తమకు కల్పించిన ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని ముద్రగడ కుమారుడు బాలు తమ న్యాయవాది ద్వారా కోర్టుకు తెలిపారు. రాజ్యాంగ హక్కులు తమకు కల్పించేలా చూడాలని కోరారు. తమ ఇంటిపై పోలీసులు దాడి చేసి అనుచితంగా ప్రవర్తించారని బాలు చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment