తాజా వార్తలు

Wednesday, 29 June 2016

కాసేపు అక్కడే ఉంటే హృతిక్ కూడా …

టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లు జరిపిన విషయం తెలిసిందే. ఇందులో 40 మంది మరణించగా, దాదాపుగా 150మంది వరకు గాయపడ్డారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుండి బాలీవుడ్ హీరో హృతిక్, అతని కుమారులు బయటపడ్డారు. ఉగ్రదాడికి కొంతసేపటికి ముందు ఆ ముగ్గురు అక్కడే ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ లో షేర్ చేశాడు.

ఓ ఫ్లైట్ మిస్సవడంతో ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో ఎదురుచూసిన ఆయన సిబ్బంది సహాయంతో ఎకానమీ ఫ్లైట్ లో ఎక్కి బయలుదేరాడు. ఆ తరువాత వారి ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానశ్రయంలో పేలుళ్ల ఘటన జరిగింది. ఈ సంఘటన గురించి తెలుసుకొని షాక్ కు గురయ్యానని హృతిక్ ట్విట్టర్ లో తెలిపాడు. విమాన సిబ్బంది సహాయం వల్ల తాము ఈ దాడి నుంచి తప్పించుకోగలిగామని అందుకు వారికి కృతఙ్ఞతలు అని తెలిపాడు. అయితే “మతం ముసుగులో ఉగ్రవాదులు సామాన్యుల ప్రాణాలు తీస్తున్నారని, అందరం ఏకమై ఉగ్రదాడికి వ్యతిరేకంగా పోరాడాలని” ఆయన పిలుపునిచ్చారు.
« PREV
NEXT »

No comments

Post a Comment