తాజా వార్తలు

Tuesday, 28 June 2016

"నేను శివుడికి జన్మనిచ్చా.."

తన అందచందాలు గ్లామర్ తో  యువతను వెర్రెత్తించిన మోడల్ సోఫియా హయత్ నటిగా కూడ ఎంతో పేరు సంపాదించుకుంది.. అంతేకాదు ఆమె.. తన మార్గాన్ని ఆథ్యాత్మికత వైపు మళ్ళించుకున్నట్లు, ఓ నన్ గా మారుతున్నట్లు ఇటీవల ఏకంగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ వెల్లడించింది. అయితే అక్కడితో ఆగని ఆమె.. ఇప్పుడు ఏకంగా శివుడికే జన్మనిచ్చానంటోంది.
బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని అభిమానులను తనవైపు తిప్పుకున్న నటి, మోడల్ సోఫియా హయత్... నన్ మారి, అందరికీ ఝలక్ ఇచ్చిన విషయం మరచిపోక ముందే.. మరో సంచలనం రేపింది. తాజాగా తన కెరీర్ కు గుడ్ బై చెప్పి, క్రిస్టియన్ నన్ గా అవతారమెత్తిన విషయం ఇటీవల సంచలనం రేపింది. ఈ నెల మొదట్లో ఓ మీడియా సమావేశం పెట్టిమరీ ఆ విషయాన్ని ఆవిడగారు అందరి ముందుకూ తెచ్చింది. ఇకపై తాను సన్యాసినిగా జీవించనున్నట్లు తెలిపిన ఆమె... తన జీవితాన్ని దేవుడి దగ్గరే ఎక్కువగా గడిపే ప్రయత్నం చేస్తానని, సమాజ సేవాకార్యక్రమాల్లోనూ పాల్గొంటానని చెప్పింది. ఇదంతా బాగానే ఉంది.. అక్కడే  మరో ట్విస్ట్ ఇస్తూ ఇకపై తనను గయా మదర్ సోఫియా గా పిలవాలని విన్నవించింది. దీనికి తోడు జనానికి షాక్ ఇచ్చేలాంటి మరోవార్త వారి చెవిన పడేసింది. తాను ఇప్పటిదాకా అందంగా ఉండటంకోసం వక్షోజాలకు సిలికాన్ ఇంప్లాంట్ప్ పెట్టుకున్నాని, ఇప్పుడు సన్యాసినిగా మారుతుండటంతో వాటిని తీసివేస్తున్నానంటూ అందరికీ ప్రదర్శనకూడ ఇచ్చింది. 


అయితే ఇప్పటిదాకా చెప్పినదంతా సోఫియా హయత్ గతం...  హాట్ మోడల్ నుంచి నన్ అవతారం నుంచి ఇప్పుడు ఏకంగా హిందూమతానికి చెందిన ఓ దేవుడికే జన్మనిచ్చానని చెప్తోంది.  నన్ అవతారంలో కొన్నాళ్ళు కనిపించిన హయత్.. ఇటీవల కైలాష్ యాత్రకు వెళ్ళింది. యాత్రలో భాగంగా ఎల్లోరా, ఔరంగాబాద్ లలో తాను శివలింగంతో కలసి తీయించుకున్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, మరో సంచలనానికి తెర తీసింది.  శివలింగంనుంచీ ఓ భారీ అయస్కాంత శక్తి వచ్చి తనలో ప్రవేశించిందని, అప్పుడు కనీసం తల పైకెత్తలేకపోయానని,  ఇప్పుడు ఆ శక్తి ఏమిటో తనకు అర్థమైందని చెప్పిన ఆమె... చివరిగా తాను శివుడికి జన్మనిచ్చానంటోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment