తాజా వార్తలు

Thursday, 16 June 2016

గేస్‌ ఆర్‌ లవబుల్‌…!

నాకు చాలామంది గే పీపుల్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు… స్వలింగ సంపర్కులైనంత మాత్రాన వాళ్లని వేరుగా, చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. దె ఆర్‌ లవబుల్‌ అన్నారు హీరోయిన్‌ ఇలియానా. గేస్‌ గురించి బయట ఎంతో మాట్లాడుతుంటారు. కానీ అందరూ అనుకునేంతగా వాళ్లేమీ ఉండరని కామెంట్‌ చేసింది ఇల్లీ బేబ్‌.

హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఇలియానా స్వలింగ సంపర్కుల మీద తన సానుకూల దృక్పధాన్ని వెల్లడించింది. అమెరికా ఓర్లాండోలోని పల్స్‌ నైట్‌ క్లబ్‌లో కాల్పుల ఘటన తర్వాత గే కల్చర్‌ మీద మరోసారి విస్తృత చర్చ జరుగుతున్న టైంలో ఇలియానా స్టేట్‌మెంట్‌పై చర్చ మొదలైంది.
« PREV
NEXT »

No comments

Post a Comment