తాజా వార్తలు

Monday, 6 June 2016

ఆయన నిర్మాణంలో నేను నటించను…

ప్రతి సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే విద్యాబాలన్, నిర్మాత సిద్దార్థ కపూర్ ను వివాహమాడిన విషయం తెలిసిందే. వీరి వివాహానంతరం ఈ కాంబినేషన్లో ఒక్క సినిమా అయినా వస్తుందనుకున్నా ఇంతవరకు అలాంటి వార్త కూడా రాలేదు. అయితే ఈ విషయంపై విద్యాబాలన్ స్పందించింది. తను తన భర్త నిర్మాణంలో నటించాలనుకోవడం లేదని చెప్పేసింది.
“మేం జంటగా కలిసి పనిచేస్తే చాలా బాగుంటుందని తెలుసు. కానీ వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని కలుపకూడదనేదే నా అభిప్రాయమని, అలా చేయడం మా వైవాహిక జీవితానికి కూడా మంచిదని అనుకుంటున్నానని విద్యాబాలన్ తెలిపింది. దీనికి కూడా కారణాలు లేకపోలేదని ఎందుకంటే కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా ఆడకపోవచ్చు. దాని వల్ల మా జీవితంలో ఎలాంటి అవంతరాలు రాకూడదని అనుకుంటున్నామని చెప్పింది. అయితే తనకు తన మరిది కునాల్ రాయ్ కపూర్ దర్శకత్వంలో ఒక సినిమాలోనైనా నటించాలనుందని” మాత్రం తన మనసులోని మాటను బయటపెట్టింది విద్యాబాలన్.
« PREV
NEXT »

No comments

Post a Comment