తాజా వార్తలు

Saturday, 25 June 2016

“ఇండిపెండెన్స్ డే 2” రివ్యూ!

కథ:
1996లో అమెరికాను ఎటాక్ చేసిన ఎలియన్స్ ను అప్పటి ప్రెసిడెంట్ మరియు నేవీ అధికారి బృందం కలిసి అంతమొందిస్తారు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అనగా 2016లో ఏలియన్స్ మరింత టెక్నాలజీతో, మరింత మంచి ప్లానింగ్ తో అమెరికాను మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఎటాక్ చేస్తాయి. ఏం చేయాలో, ఏలియన్స్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక తికమకపడుతున్న అమెరికా ఆర్మీకి మరో గ్రహం నుంచి వచ్చిన సరికొత్త టెక్నాలజీ దొరుకుతుంది. సో, అమెరికన్ ఆర్మీకి దొరికిన సరికొత్త టెక్నాలజీ ఏలియన్స్ ను ఎంతవరకూ ఉపయోగపడింది? ఏలియన్స్ ను ఏ విధంగా అంతమొందించారు? అందుకోసం వారు ఎదుర్కొన్న సమస్యలేమిటి? అనేది “ఇండిపెండెన్స్ డే 2” సినిమా కథ!


విశ్లేషణ:
దాదాపుగా “ఇండిపెండెన్స్ డే”లో కనిపించిన పాత్రలో మనకి ఈ సీక్వెల్ లోనూ కనిపిస్తాయి. విల్ స్మిత్ ఒక్కడే కనిపించడు. నటీనటులందరూ తమ తమ పాత్రల పరిధిమేరకు చక్కగా నటించారు. సినిమా మొత్తం దాదాపుగా కంప్యూటర్ గ్రాఫిక్సే కాబట్టి వారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు.

అయితే… సినిమాలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. తమ ఏలియన్ జాతిని అంతమొందించే టెక్నాలజీని నాశనం చేయడానికి స్వయంగా ఏలియన్ క్వీన్ ఎందుకు రావాలి? సగానికిపైగా ప్రపంచాన్ని కవర్ చేసేసిన స్పేష్ షిప్ కేవలం ఒక్క ఏలియన్ చనిపోతే తిరిగి వెళ్లిపోవడం ఏమిటి? నిజంగానే ప్రపంచాన్ని నాశనం చేయడమే ఈ ఏలియన్ల ధ్యేయం అయితే.. తమ టెక్నాలజీతో కాక భూమిలోని సారాన్ని తీసుకోవాలనుకోవడం లాంటి విషయాలు చాలా ఫన్నీగా అనిపిస్తాయి.
ముఖ్యంగా ఏలియన్స్ భూమిని నాశనం చేయడానికి ప్రయత్నించే సీన్లు.. “మేన్ ఆఫ్ స్టీన్” సినిమాలోని క్లైమాక్స్ సీన్ ను తలపిస్తాయి. అలాగే.. హీరో అండ్ గ్యాంగ్ మదర్ షిప్ లోకి వెళ్లడానికి చేసే ప్రయత్నాలు, లోపలికి వెళ్ళాక అక్కడి ఏలియన్స్ తో మల్లయుద్ధం చేయడం లాంటి ఫీట్లు హాలీవుడ్ సినిమాలను రెగ్యులర్ గా చూసే ఆడియన్స్ కు చాలా ఇబ్బందిగానూ, ఏదో తెలుగు మసాలా చూస్తున్న అనుభూతిని కలిగిస్తాయి.
క్లైమాక్స్ లో ఏలియన్ క్వీన్ అమెరికన్ ఆర్మీ బేస్ ను ఎటాక్ చేసే సీన్ మరియు స్పేష్ షిప్ ప్రపంచాన్ని కబళించినట్లుగా చూపే సీన్ మినహా గ్రాఫిక్ వర్క్ అంతా సాదాసీదాగా ఉంటుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కొన్ని సీన్లు మాత్రం 1996లో వచ్చిన వెర్షనే బెటారేమో అనిపించకమానదు. కథ పరంగానూ అలాగే అనిపిస్తుంటుంది, మొదటి భాగం కథనంలో ఉన్నంత పట్టు ఈ సీక్వెల్ లో లేదు.

మొత్తానికి…
ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేయకుండా.. కథ గురించి పట్టించుకోకుండా.. కేవలం గ్రాఫిక్స్ ను ఎంజాయ్ చేయాలనుకొనేవారు “ఇండిపెండెన్స్ డే” సినిమాను చూడవచ్చు.
« PREV
NEXT »

No comments

Post a Comment