తాజా వార్తలు

Friday, 10 June 2016

ముద్రగడ, జగన్‌ లపై ఇంటెలిజెన్స్‌ నిఘా!

ముద్రగడ పద్మనాభం, వైఎస్‌ జగన్మోహన రెడ్డి ల మధ్య ఏమైనా అప్రకటిత రహస్య లింకు ఉన్నదో లేదో అని తేల్చుకోవడానికి మాత్రం కాదు సుమా! ఈ ఇద్దరు నాయకుల విషయంలో వేర్వేరు అంశాలకు సంబంధించి బెంబేలెత్తిపోతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ఇద్దరు నాయకులకు సంబంధించి తనలోని భయాలను నివృత్తి చేసుకోవడానికి ఇంటెలిజెన్స్‌ నిఘా వర్గాలను పురమాయించినట్లుగా సెక్రటేరియేట్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఇంతకూ చంద్రబాబును అంతగా ఆందోళనకు గురిచేస్తున్న ఆ ఇద్దరు నాయకుల వివరాలు ఏంటో తెలుసా? 

అనంతపురం జిల్లాలో జగన్‌ రైతు భరోసా యాత్ర నిర్వహిస్తే ఆ జిల్లాలో ఆయనకు లభించిన జనం స్పందన చంద్రబాబు నివ్వెరపోయారుట. 

ఎమ్మెల్యేల సంఖ్య పరంగా అనంత పురం జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ఉన్న బలం చాలా పరిమితమే అయినప్పటికీ.. జిల్లా వ్యాప్తంగా పర్యటనలో ప్రతిచోటా ఆయన టూర్‌కు అంత పెద్ద సంఖ్యలో జనం ఎలా వచ్చారో ఆయనకు అర్థం కాలేదట. ఆయనకది సస్పెన్స్‌గానే ఉండిపోయింది. 
అలాగే ముద్రగడ విషయంలో ఆయన చింత వేరే ఉంది. కాపు నేతల అరెస్టుల తర్వాత.. ముద్రగడ ఏం చేసినా సరే.. మీడియాలోని అన్ని ఛానళ్లలోనూ ఫోకస్‌ చాలా ఎక్కువగా వస్తోంది. అదే సమయంలో ముద్రగడ వ్యాఖ్యలను ఖండిస్తూ తన మంత్రులు, తెదేపా నాయకులు చివరికి తాను మాట్లాడుతున్న విషయాలకు కూడా మీడియా ఫోకస్‌ తక్కువగానే ఉంది. మీడియాలో ఏమైనా అన్ని చానెళ్లను ముద్రగడ తరఫున ఎవరైనా మేనేజి చేస్తున్నారా? 

ఈ రెండు అంశాలు చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నాయిట. అందుకే ఈ రెండు అంశాలను ఆరాతీసి వివరాలు తెలియజేయాల్సిందిగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌ పోలీసులను పురమాయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా చంద్రబాబులో విపక్ష నేతల గురించిపుట్టే సకల భయాలను తీర్చడానికే పోలీసు యంత్రాంగం పనిచేయాల్సి వచ్చేట్లుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment