తాజా వార్తలు

Wednesday, 1 June 2016

కరీనా తల్లి కాబోతుందా…?

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తల్లి కాబోతుందా…? ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. ఇంతకుముందు చాలా సార్లు ఇలాంటి వార్తలను ఖండించిన కరీనా.., తమకు అప్పుడే పిల్లలు కనాలని లేదు అని కూడా చెప్పేసింది. కానీ తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం కరీనా మూడు నెలల గర్భవతి అని బాలీవుడ్ లో  మాట్లాడుకుంటున్నారు. అయితే కరీనా, సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం హాలిడే ట్రిప్ లో ఉండటంతో ఈ విషయంపై ఇంతవరకు వారు ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. మరి ఈ గాసిప్ పై ఖాన్ కుటుంబం, కపూర్ కుటుంబం ఏమంటుందో చూడాలి.
« PREV
NEXT »

No comments

Post a Comment