తాజా వార్తలు

Monday, 6 June 2016

కోదండరాం ఏ జేఏసీ చైర్మనో చెప్పాలి…!

తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి జగదీష్‌రెడ్డి. అసలు రాష్ట్రంలో పొలిటికల్ జేఏసీ ఉనికిలోనేలేదన్న జగదీష్‌రెడ్డి… కొందరు వ్యక్తులు తెలంగాణ పొలిటికల్ జేఏసీ పేరు చెప్పుకుని సీఎం కేసీఆర్‌పై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు కోదండరాం ఏ జేఏసీకి ఛైర్మనో చెప్పాలని ప్రశ్నించారు జగదీష్‌రెడ్డి. పొలిటికల్ జేఏసీ లక్ష్యం ఏంటో కోదండరాం చెప్పాలని నిలదీశారు. ఇప్పుడున్న జేఏసీ ఎప్పుడు ఏర్పాటైంది? దాని కార్యవర్గమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రాభివృద్ధికి కలిసిరావాలని కోదండరాంను కోరామన్న జగదీష్‌రెడ్డి… కోదండరాం రాజకీయాల్లోకి రావాలనుకుంటే రావొచ్చన్నారు… అంతేగానీ, ఒకపేరు చెప్పి… మరోపని చేయొద్దని విమర్శించారు. కోదండరాం వెనుక ఎవరున్నారో చెప్పాలని… ఓట్ల కోసం పనిచేసేవారికి వంతపాడటం సరికాదని ఆరోపించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment