తాజా వార్తలు

Sunday, 5 June 2016

అది సోనియాను తప్పుబట్టినట్లే:జానా

పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఇతర నేతలపై సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత జానారెడ్డి ఖండించారు. పార్టీలో ఉన్నత పదవులు, కార్యవర్గాలు సోనియాఆమోదంతోనే జరుగుతాయని, అటువం టి కార్యవర్గాన్ని దూషించడమంటే ఆమె నిర్ణయాన్ని తప్పుపట్టడమేనని ఓ ప్రకటన లో పేర్కొన్నారు. ఉత్తమ్‌పై వెంకటరెడ్డి వ్యక్తిగత దూషణలు సమర్థనీయం కాదన్నారు.
పార్టీకి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని... ఈ తరుణంలో పార్టీ పటిష్టతకు సీనియర్ నాయకులు కృషి చేయాల్సి ఉందని సూచించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment