తాజా వార్తలు

Sunday, 12 June 2016

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

గత నెల 22న నిర్వహించిన జేఈఈ-2016 అడ్వాన్స్‌డ్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ గువాహటి ఈ ఫలితాలను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు లక్షా 58వేల మంది విద్యార్థులు హాజరుకాగా, తెలుగు రాష్ట్రాల నుంచి 21వేల మంది హాజరయ్యారు.

జేఈఈలో ఈసారి కూడా తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో తెలుగు విద్యార్థి జీవితేష్‌ నాలుగో ర్యాంకు దక్కించుకోగా, మొదటి 100 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు 30 శాతం సాధించారు. ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచారు అధికారులు. దేశవ్యాప్తంగా ఉన్న 17 ఐఐటీలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment