తాజా వార్తలు

Saturday, 18 June 2016

కేసీఆర్ ఫాంహౌస్ భూమి ఎకరా 10 లక్షలకు ఇస్తారా?

సీఎం కేసీఆర్ తన ఫాం హౌస్ భూమిని ఎకరా రూ.10 లక్షలకు ఇస్తారా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని  పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగితే ప్రాజెక్టులను తాము అడ్డుకుంటున్నట్లు మంత్రి హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ జీవో 123 ద్వారా నిర్వాసితులకు న్యాయం జరగదు, ఆ జీవోలో నష్టపరిహారం, పునరావాసం అంశాలు లేవని ఆయన ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని అమలుచేసి భూ నిర్వాసితులకు నష్టపరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 లక్షలే ఇస్తామనడం అన్యాయమన్నారు. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి, భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చే విధానాన్ని ఖరారు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment