తాజా వార్తలు

Wednesday, 29 June 2016

ఇండియాలో తొలి సినిమాగా 'కబాలీ'!

లేటు వయసులోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ ఘాటుగా మాయ చేస్తున్నాడు.  ఏ ముహుర్తాన కబాలి సినిమా మొదలు పెట్టాడో కాని, రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే టీజర్, నిరుప్పుడా సాంగ్, ఫస్ట్ పోస్టర్ లతో అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు కోట్ల ఆన్ లైన్ వ్యూస్, ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా రకరకాల రికార్డ్ లను సూపర్ స్టార్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో రికార్డ్ కు రెడీ అవుతున్నాడు. చెన్నైలోని భారీ హోర్డింగ్ లతో పాటు బస్సులు, రైళ్లను కూడా కబాలి పోస్టర్లతో నిండిపోతున్నాయి. తాజాగా విమానాలపై సినిమా పోస్టర్లు అంటించి ప్రచారం చేయడంతో 'కబాలీ' మేనియా ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ఏయిర్ ఏషియా విమానాలపై కబాలీ పోస్టర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. రెండు డొమెస్టిక్ ఫ్లైట్స్ తో పాటు, మరో రెండు అంతర్జాతీయ విమానాలకు కబాలి పోస్టర్స్ వేశారు.

గతంలో దేశంలో ఏ చిత్రానికి లేని తరహాలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రచారం చేస్తున్న తొలి ఇండియన్ మూవీగా కబాలీ సెన్సెషన్ గా నిలువనుంది. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఒక్క సినిమాకు మాత్రమే ఈ తరహా ఆదరణతో కూడిన ప్రచారం లభించింది. ఎయిర్ న్యూజీలాండ్ విమానసంస్థ వారు 'ద హాబిట్' మూవీకి మాత్రమే విమానాలపై పోస్టర్లు అంటించి ప్రచారం చేశారు. రెండు భారీ ఫ్లాప్ ల తరువాత రజనీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సినిమాను ఎలాగైన బ్లాక్ బస్టర్ సక్సెస్ చేయాలన్న ప్రయత్నంలో భాగంగా రజనీ పోస్టర్లతో కబాలీ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీ భార్యగా రాధికా ఆప్టే నటిస్తుండగా.. ఇతర పాత్రలలో కలైరసన్, దినేష్, రిత్విక తదితరులు నటించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment