తాజా వార్తలు

Monday, 6 June 2016

చేపకళ్లను దానం చేస్తుందట…

‘సర్దార్ గబ్బర్ సింగ్’ లోని ఓ పాటలో అన్నట్లు ‘నీ చేప కళ్లు చేప కళ్లు గుచ్చుకున్నవే’ అంటూ ప్రతి ఒక్క కాజల్ అభిమాని ఆమె గురించి పాటపాడుకుంటూనే ఉంటారు. అయితే ఆ అందమైన కళ్లను దానం చేసేందుకు సిద్ధమైపోయింది ఈ హీరోయిన్. తాను మరణించిన తరువాత తన కళ్లను దానం చేస్తానని బహిరంగంగా చెప్పింది కాజల్.

రణ్ దీప్ హుడా, కాజల్ ప్రధాన పాత్రలలో నటించిన ‘దో లఫ్జోన్ కీ కహానీ’ ప్రమోషన్ లో భాగంగా కాజల్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇందులో అంధురాలిగా నటించానని, దాంతో వారి కష్టాలేంటో తెలుసుకున్నానని అందుకే తన మరణం తరువాత తన కళ్లను దానం చేస్తానని చెప్పింది. అంతేకాదు ఇందులో హీరోగా నటించిన రణ్ దీప్ హుడా కూడా తన కళ్లను దానం చేస్తానని చెప్పాడు. దీంతో అవయవదానం చేసే వారి లిస్ట్ లో తాజాగా ఈ ఇద్దరు కూడా చేరిపోయారు.
« PREV
NEXT »

No comments

Post a Comment