తాజా వార్తలు

Thursday, 30 June 2016

ఉద్యోగుల విభజనపై కమల్ నాథన్ కమిటీ తుది కసరత్తులు…

తెలుగు రాష్ట్రాల విభజన కారణంగా ఉద్యోగులను విభజించేందుకు ఏర్పాటు చేసిన కమలనాధన్ కమిటీ కసరత్తు దాదాపు పూర్తయింది. ఉద్యోగుల ప్రక్రియను పూర్తి చేసేందుకు హైదరాబాద్‌లో ఇవాళ, రేపు కీలక సమావేశాలు నిర్వహిస్తోంది కమిటీ. ఈ సమావేశంలో రెండు రాష్ర్టాలకు చెందిన అధికారులు పాల్గొంటారు.

కమలనాధన్ కమిటీ వివిధ విభాగాల కింద మొత్తం 153 యూనిట్లను గుర్తించింది. వీటి అధారంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపడుతుంది. ఇప్పటి వరకు 146 యూనిట్లకు సంబందించి ఉద్యోగుల లిస్టును ఖరారు చేసింది. అలాగే వివిధ శాఖల HODలకు చెందిన ఏడు యూనిట్‌లకు సంబంధించిన ఉద్యోగుల విభజన ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటికే ఈ శాఖలకు చెందిన ఉద్యోగుల విభజన వివిద దశల్లో ఉంది. ఈ రెండ్రోజులు జరిగే సమావేశాల్లో ఏడు యూనిట్లకు సంబంధించిన ఉద్యోగుల విభజనపై ప్రధానంగా చర్చించనున్నారు.

రెండు రాష్ర్టాల ప్రతినిధులు ఓ అంగీకారానికి వస్తే విభజన కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగుల విభజన విషయంలో కమలనాధన్ కమిటీ అనుసరిస్తున్న పద్దతులను తెలంగాణ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విభజన అంశం ఎలా ముగుస్తుందన్న ఆసక్తి నెలకొంది.
« PREV
NEXT »

No comments

Post a Comment