తాజా వార్తలు

Monday, 6 June 2016

బాబు జీవితమంతా కుట్రల మయం

సీఎం చంద్రబాబు వంటి పనికిమాలిన రాజకీయ నాయకుడు దేశ రాజకీయాల్లోనే మరొకరు లేరని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు జీవితం అంతా కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ హత్యల మయమేనన్నారు. రాజకీయాలను కలుషితం చేసి భ్రష్టు పట్టించిన ఘనత ఆయనదేనని, రాజకీయం అంటే ప్రజాసేవ కోసం కాదు, అధికార లాలసత్వం కోసమేననేది చంద్రబాబు నిరూపించారని దుయ్యబట్టారు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, నంబూద్రిపాద్, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి లాంటి వారిని చూశానని చంద్రబాబు చెప్పుకున్నారని, వ్యక్తిత్వంలో హిమవన్నగం లాంటి వారైన వీరి పేర్లను ఉచ్ఛరించే అర్హత సైతం సీఎంకు లేదన్నారు.బాబు విశ్వాసఘాతకుడని ఆయనకు పిల్ల నిచ్చిన మామ ఎన్టీఆరే విమర్శించారని, ఇక చంద్రబాబు వ్యక్తిత్వానికి వేరే సర్టిఫికెట్ ఏముంటుందని భూమన ప్రశ్నించారు.
 హామీలు నెరవేర్చమనడం తప్పా..: వైఎస్ జగన్ లాంటి నాయకుడిని తాను చూడలేదని చంద్రబాబు చెప్పడాన్ని భూమన తీవ్రంగా తప్పు పట్టారు. బాబు చేస్తున్న అవినీతి, అక్రమాలను ఎండగట్టడం, ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరుతున్నందుకు జగన్‌ను ఆడిపోసుకుంటున్నారా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి జగన్ ఎప్పుడూ అడ్డు పడలేదని, అందులో జరుగుతున్న అవినీతిని అడ్డుకునే ప్రయత్నమే చేస్తున్నారన్నారు. బాబు మాటలకు  జగన్ బెదరరని.. సీఎం అవినీతి, మోసాలపై పోరాటం సాగిస్తూనే ఉంటారని భూమన స్పష్టం చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment