తాజా వార్తలు

Monday, 13 June 2016

అప్పుడు అనుష్క, ఇప్పుడు కోహ్లి…

విడిపోయి, కలిసిపోయిన తరువాత ఆ ప్రేమపక్షులు మధ్య ప్రేమ మరింత పెరిగినట్లుంది. అందుకే ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోతున్నారు. అయితే ఇక్కడ చిన్న చేంజ్. ఇంతకుముందు ప్రియుడు ఎక్కడ ఉంటే అక్కడ ప్రియురాలు వాలిపోయేది. ఇప్పుడేమో ప్రియురాలు ఎక్కడుంటే ప్రియుడు అక్కడ వాలిపోతున్నాడు. ఆ ప్రేమ పక్షులు మరెవరో కాదండి క్రికెటర్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ.

ఇంతకుముందు కోహ్లి ఎక్కడ మ్యాచ్ ఆడితే, అక్కడ వాలిపోయేది అనుష్క శర్మ. ఆపై వారు విడిపోయారు. అయితే ఇప్పుడు మళ్లీ కలిసిన తరువాత మాత్రం సీన్ రివర్స్ అయిపోయింది. ఇన్ని రోజులు కోహ్లి కోసం అనుష్క రాగా, ఇప్పుడు అనుష్క కోసం కోహ్లి వెళుతున్నాడు. మొన్నటికి మొన్న అనుష్క ఫారిన్ ట్రిప్ వెళుతుండగా ఎయిర్ పోర్ట్ వరకు వెళ్లి మరీ సెండాఫ్ ఇచ్చిన కోహ్లి, ఇప్పుడు అనుష్క సినిమా ఎక్కడ జరిగితే అక్కడ వరకు వెళ్లి అనుష్కను డ్రాప్ చేసి వస్తున్నాడట. అంటే మొత్తానికి వారి మధ్యలో ఒకసారి వచ్చిన బ్రేకప్ మరింత ప్రేమను పెంచిదన్నమాట.
« PREV
NEXT »

No comments

Post a Comment