తాజా వార్తలు

Wednesday, 1 June 2016

అమరులను విస్మరించిన కేసీఆర్

‘రాష్ట్ర ఏర్పాటు కోసం 1,100 మంది ప్రాణత్యాగం చేస్తే.. ఇప్పటివరకు గుర్తించింది 300 మం దినేనా? పార్టీలో చేర్పించాలనుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీల అడ్రస్‌లు దొరుకుతాయి. కానీ.. తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న అమరవీరుల అడ్రస్‌లు దొరకవా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా పర్యటన సందర్భంగా బుధవారం ఖమ్మంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాటల గారడీతో కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, అల్లుడు కలసి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇదెంతో కాలం సాగదని అన్నారు. కేజీ టు పీజీ విద్య, ముస్లింలకు రిజర్వేషన్ హామీలన్నీ అటకెక్కాయన్నారు. వైఎస్సార్‌సీపీ అంశాలవారీగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. ప్రజలకు అండగా పోరుబాట పడుతుందని అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment