తాజా వార్తలు

Wednesday, 29 June 2016

సింగపూర్ పర్యటనలో బిజీగా కేటీఆర్…

పెట్టుబడుల సేకరణే లక్ష్యంగా సింగపూర్లో పర్యటిస్తున్న తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీఆర్ వివిధ సంస్థల ప్రతినిధుల్ని కలిశారు. సింగపూర్‌లో గృహనిర్మాణ రంగంలో అగ్రగామిగా ఉన్న సురబనా జ్యురాంగ్‌ కంపెనీ సీఈవో టియో ఎంగ్‌ చెంగ్‌తో భేటీ అయ్యి, తెలంగాణలోనూ చేపట్టబోతున్న గృహ నిర్మాణాల గురించి ఆయనకు వివరించారు.

ఇందులో భాగంగా సురబనా జ్యురాంగ్‌ కంపెనీ హైదరాబాద్‌లో ఓ బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాల్సిందిగా కోరారాయన. అలాగే మౌలిక వసతుల రంగంతో పాటు ఫార్మ సిటీ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. దీనిపై స్పందించిన సీఈవో త్వరలో ఓ ప్రతినిధి బృందాన్ని తెలంగాణకు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత సింగపూర్‌లో టావుస్ ఇండస్ర్టియల్ పార్క్, బయోపోలిస్ పార్కు, క్లీన్ టెక్ పార్కులను సందర్శించారు కేటీఆర్.
« PREV
NEXT »

No comments

Post a Comment