తాజా వార్తలు

Saturday, 18 June 2016

పరిశ్రమలు గ్రామగ్రామానికి విస్తరించాలి…

పరిశ్రమలు కేవలం నగరాలు పట్టణాలకు పరిమితం కారాదాని, గ్రామగ్రామానికీ విస్తరించాలన్నారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌. రాష్ట్ర పరిశ్రమలశాఖ వార్షిక నివేదికను విడుదల చేసిన కేటీఆర్‌… ఇసుక స్థానంలో రాక్‌శాండ్‌ వాడకం పెరిగితే సమస్యలు తగ్గుతాయన్నారు.

తెలంగాణ ఐటీ పాలసీకి విదేశాల నుంచి కూడా మద్దతు లభిస్తోందని, ఇంత అనువైన వసతులు మరెక్కడా లేవన్నారు మంత్రి కేటీఆర్‌. పరిశ్రమల ఏర్పాటు హైదరాబాద్‌కే పరిమితం చేయడం లేదని తెలిపారు. ఉపాధి కల్పనే లక్ష్యంగా జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహిస్తాం. ఎలక్ట్రానిక్స్, మాన్యుఫ్యాక్టరింగ్ రంగంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందిని తెలిపారు కేటీఆర్‌.

మైనింగ్ రంగంలో గత ఏడాదితో పోల్చుకుంటే 41శాతం ఆదాయం పెరిగింది. ఈ ఏడాది మైనింగ్ రంగంలో ఆదాయాన్ని రూ.4వేల కోట్లకు పెంచాలని ఆలోచిస్తున్నామన్నారు కేటీఆర్‌. మైనింగ్ కార్మికుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ చర్యలతో ఇసుక రేటు భారీగా తగ్గిందన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment