తాజా వార్తలు

Saturday, 25 June 2016

“కుందనపు బొమ్మ” రివ్యూ!

కథ:
సుచి (చాందిని చౌదరి) విజయనగరం దగ్గర్లోని ఓ గ్రామానికి పెద్ద అయిన మహాదేవరాజు (నాగినీడు) ఏకైక కుమార్తె. చిన్నప్పట్నుంచి తన ఇంట్లోనే పెరిగిన గోపి (సుధాకర్)తో తన కూతురు పెళ్లి చేయాలనుకొంటాడు మహాదేవరాజు. అయితే అప్పటికే హైద్రాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ కూతురుతో ప్రేమలో ఉన్న సుధాకర్ ఆ పెళ్లిని తప్పించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఈలోగా సుచి తమ ఇంటికి కారు రిపేరు చేయడానికి వచ్చిన వాసు (సుధీర్ వర్మ)తో ప్రేమలో పడుతుంది.

అయితే సడన్ గా ఉరొచ్చిన గోపి, ఉన్నపళంగా తనకు సుచితో పెళ్లి చేసేమని కోరతాడు. మహాదేవరాజు వెంటనే పెళ్లి పనులు మొదలెట్టేస్తాడు. అసలు ముందు పెళ్ళంటే వద్దన్న గోపి ఉన్నట్లుండి పెళ్లి కోసం అంతగా ఎందుకు కంగారుపడ్డాడు? వాసుతో సుచి ప్రేమ పెళ్లివరకూ వచ్చిందా? లేదా? అనేది “కుందనపు బొమ్మ” సినిమా కథ.
నటీనటుల పనితీరు:
షార్ట్ ఫిలిమ్స్ తో యూత్ ని బాగా ఆకట్టుకొన్న చాందిని ఈ సినిమాలో “కుందనపు బొమ్మ”గా అమ్మాయి అందంగా కనిపించడం వరకూ ఒకే కానీ, నటనలో మాత్రం ఇంకా పరిణతి చెందాలి. ముఖ్యంగా బలమైన ఎమోషన్స్ పలికించడంలో ఇబ్బంది పడింది ఈ సుందరి.కొత్తబ్బాయి సుధీర్ వర్మ ఫర్వాలేదనిపించుకోగా, నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో సుధాకర్ ఆకట్టుకొన్నాడు. నాగినీడు, రాజీవ్ కనకాల తమ పాత్రల పరిధిమేరకు నటించారు. యాంకర్ ఝాన్సీ నవ్వించాలని చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదనే చెప్పాలి.

సాంకేతికవర్గం పనితీరు:
కీరవాణి సంగీతం పర్వాలేదనిపించినా, ఆయన స్థాయికి తగ్గ సంగీతం సినిమాకు అందలేదనే ఫీలింగ్ ఒక మామూలు ప్రేక్షకుడికి కూడా అనిపించక మానదు. ఎస్.డి.జాన్ కెమెరా వర్క్ గురించి మాట్లాడితే, పల్లెటూరి అందాల వరకూ చక్కగానే పిక్చరైజ్ చేసి ఇంపార్టెంట్ సీన్ ల వద్ద ఎమోషన్లు సరిగ్గా బంధించలేకపోయాడు. నిర్మాణ విలువలు పర్వాలేదు… నిర్మాతలు అవసరమైన ఖర్చే పెట్టారు.

రచన-దర్శకత్వం:
ముళ్ళపూడి వరా రాసుకొన్న కథ ఎలాగున్న ఆ కథను నడిపించిన కథనం పేలవంగా ఉండటంతో దర్శకుడిగానూ తన మార్క్ ను చూపించలేకపోయాడు. తన మేరకు పాటల్లో వంశీ స్టైల్ ను, సన్నివేశాల్లో బాపుగారి శైలిని తలపించినా, అది సినిమా మొత్తం క్యారీ అవ్వలేదు. పోస్టర్లు, ట్రైలర్లు పబ్లిసిటీతో కించెత్తు ఆశ కలిగినా చివరకు సినిమాకొచ్చే వారికి నిరాశ మిగిల్చాడు ముళ్ళపూడి వరా.

విశ్లేషణ:
“కుందనపు బొమ్మ” అనే టైటిల్ ఎంత వినసోంపుగా ఉందో.. సినిమా అంతగా లేదు అన్నది నిజం. సినిమా అన్ని శాఖల్లో అంటే కథ-కథనాల్లో, నటీనటుల పెర్ఫార్మెన్స్ లో, సాంకేతికవర్గం పనితనంలో మొత్తానికి సినిమాలో ఏదో తెలియని వెలితి అని చెప్పక తప్పదు.

ఫైనల్ గా చెప్పాలంటే..
చాందిని అభిమానులు, ముళ్ళపూడి- బాపు శ్రేయోభిలాషులు మాత్రమే ధైర్యం చేసి చూడదగ్గ సినిమా కుందనపు బొమ్మ…
« PREV
NEXT »

No comments

Post a Comment