తాజా వార్తలు

Wednesday, 29 June 2016

అఖిల్ ప్రేయసి చాలా ఫేమస్!

అక్కినేని యువ వారసుడు అఖిల్ ఇటీవల ఓ అమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఆ అమ్మాయి ఎవరనే విషయం చాలా మందికి తెలీదట. అయితే ఆమె గురించి ఓ ఆంగ్ల పత్రిక వార్త ప్రచురించడంతో ఆ విషయంపై సోషల్‌మీడియాలో పుకార్లు ఊపందుకున్నాయి. ఆమె పేరు శ్రియా భూపాల్ అని, ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె చాలా ఫేమస్ అని తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని.. శ్రియాకు గురువని ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఫ్యాషన్ రంగంలో శ్రియా భూపాల్‌కు మంచి పట్టు ఉందని, రెండేళ్ల క్రితమే ‘శ్రియా సమ్’ పేరుతో ఆమె ఓ లేబుల్ కలెక్షన్‌ను ప్రారంభించారని సమాచారం. కాన్సర్ కారణంగా చనిపోయిన తన తండ్రికి తన లేబుల్‌ను అంకితం చేశారట. రెండు నెలల క్రితం జరిగిన ‘ల్యాక్‌మీ ఫ్యాషన్ వీక్’లో తొలిసారిగా తన కలెక్షన్స్‌ను ప్రదర్శించిన శ్రియా భూపాల్ తొలి చూపులోనే తన డిజైనింగ్స్‌తో అందరినీ ఆకట్టుకుందట. రకుల్‌‌ప్రీత్‌ సింగ్, కాజల్, సమంత, శ్రియలతో పాటు బాలీవుడ్ కథనాయికలకు కూడా శ్రియా భూపాల్ డ్రస్సులను డిజైన్ చేస్తున్నారట. ఇలా సినీ రంగంతో సంబంధం ఉన్న శ్రియా కుటుంబానికి ఎప్పట్నుంచో అక్కినేని కుటుంబంతో స్నేహం ఉందని ఆంగ్ల పత్రిక నిర్ధారించింది. ఈ నేపథ్యంలో అఖిల్, శ్రియలు మొదట్నుంటే స్నేహంగా ఉండి.. ఈ మధ్యే ప్రేమలో పడ్డారేమోనని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment