తాజా వార్తలు

Thursday, 30 June 2016

చికాగోలో ‘ఆటా’ సందడి

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) రజతోత్సవాల సందడి మొదలైంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి చాల మంది ప్రముఖులు చికాగో చేరుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ సినీ నటి రాశీఖన్నాకు ఆటా సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఆటా వేడుకలలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని రాశిఖన్నా తెలిపారు. చికాగో నగరంలో ఈ వేడుకలు శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభమవుతాయి. గురువారం నుంచి అతిథుల రాక మొదలైంది. కేంద్ర మంత్రి వెంకయ్య, తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎర్రబెల్లి, ఎంపీ జగదీశ్వరరెడ్డి, నటి రాశీఖన్నా, సంగీత దర్శకుడు మణిశర్మ తదితరులు చికాగో చేరుకున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment