Writen by
Unknown
19:59
-
0
Comments
ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమానినంటూ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ నేతృత్వంలోని భారత అద్భుతంగా దూసుకెళ్తోందన్నారు. ‘‘గొప్ప..గొప్ప నేతలు చేయాలనుకున్న పనిని మోదీ చేశారు. ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగా కాలపరిమితిని (డెడ్లైన్) నిర్ణయించారు. వాటికి ఉద్యోగులు, అధికారులు, సిబ్బందిని బాధ్యులను చేస్తున్నారు. మంచి ఫలితాలు రాబట్టాలంటే అలాగే చేయాలి. అవన్నీ ఆయన చేస్తున్నారు కాబట్టే నేను మోదీకి వీరాభిమానినయ్యాను’’ అని కిమ్ చెప్పుకొచ్చారు. మోదీ అంత వేగంగా పనిచేసేందుకు ఎవరైనా అందుకు తగ్గట్టే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రధాని పనితనం తమకు సవాల్ విసురుతోందని కిమ్ కొనియాడారు.
No comments
Post a Comment