తాజా వార్తలు

Sunday, 12 June 2016

స్థానికతనే ప్రామాణికంగా తీసుకోవాలి

న్యాయమూర్తుల కేటాయింపునకు సంబంధించి లోయర్ జ్యుడీషియరీ కేటాయింపులలో స్థానికతనే ప్రామాణికంగా తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. సహేతుకంగా లేని ఆప్షన్ల విధానం కొత్త సమస్యలను సృష్టిస్తోందని తెలంగాణ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడిందని పేర్కొన్నారు.
మరోవైపు మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు జీవో 123 ద్వారానే మేలు జరుగుతుందన్న మంత్రి హరీశ్ ప్రకటన రైతులను మోసగించేలా ఉందన్నారు. సమస్యల్ని పట్టించుకోకుంటే గత ప్రభుత్వాలకు పట్టిన గతే టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పడుతుందన్నారు. ముంపు బాధితులకు ప్రస్తుత మార్కెట్ రేటును వర్తింపజేయడం, ఉద్యోగ, నివాస సదుపాయాలతో కూడిన ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment