తాజా వార్తలు

Monday, 13 June 2016

చిరంజీవిని తెలుగు రాష్ట్రాల్లో తిరగనివ్వం..


ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సినీనటుడు చిరంజీవిని తెలుగు రాష్ట్రాల్లో తిరగనివ్వమంటూ మాల మహానాడు సోమవారం ఆందోళన చేపట్టింది.  ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. రాజకీయం చేతకాక పార్టీని అమ్ముకున్న చిరంజీవి ఎస్పీ వర్గీకరణకు సిఫారసు చేయడం చేతగాని తనమని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య దుయ్యబట్టారు.
 
« PREV
NEXT »

No comments

Post a Comment