తాజా వార్తలు

Thursday, 9 June 2016

బీజేపీ అసలు స్వరూపం బయట పడింది: మల్లు రవి


రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పట్ల ఏబీవీపీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ బహదూర్ రాయ్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ అసలు స్వరూపం బయటపడిందని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో పార్టీ నేత  పవన్‌కుమార్‌రెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వెంటనే రామ్ బహదూర్ రాయ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ కేంద్ర, రాష్ట్ర అధ్యక్షులు ఖండించాలన్నారు. కాగా, పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌కు సీఎల్పీ నేత జానారెడ్డి కోవర్టని  ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment