తాజా వార్తలు

Wednesday, 29 June 2016

వారం వాయిదాకు ‘మేము’

సూర్య, అమలాపాల్, బిందుమాధవి ముఖ్య తారాగణంగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మేము'(తమిళ్ లో పసంగ-2) విడుదల మళ్లీ వాయిదా పడింది. మామూలుగా ఈ సినిమా జులై 1న విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలవల్ల రిలీజ్ డేట్‌ను జులై 8న వాయిదా వేశామని నిర్మాత జూలకంటి మధుసూదన్ రెడ్డి తెలిపారు.

ప్రతి ఒక్కరి మనసులను హత్తుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని, ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలతో తప్పక చూడాల్సిన చిత్రమని నిర్మాత అన్నారు. ఇక ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుందని, తెలుగులో కూడా అంతకన్నా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉన్నట్లు ఆయన చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment