తాజా వార్తలు

Friday, 3 June 2016

టీడీపీవే నీతిమాలిన రాజకీయాలు: మేరుగ

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని వైఎస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ చైర్మన్ మేరుగ నాగార్జున అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై విజయవాడలో బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. టీడీపీ నేతలు ఎవరు వచ్చినా తాము చర్చకు సిద్ధమన్నారు.

ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుంది ఎవరో అందరికీ తెలుసునని మేరుగ నాగార్జున ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందెవరో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. నీతిమాలిన పార్టీ  టీడీపీనే అని, నీతిమాలిన రాజకీయాలు చేస్తోంది కూడా ఆ పార్టీయేనని మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు.
« PREV
NEXT »

No comments

Post a Comment