తాజా వార్తలు

Monday, 13 June 2016

ప్రజల ఉసురు పోసుకోవద్దు


కరువు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుని పాలమూరు జిల్లా ప్రజల ఉసురుపోసుకోవద్దని ప్రతిపక్ష పార్టీలకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విజ్ఙప్తి చేశారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు 90 శాతం పనులు పూర్తయ్యాయని, కేవలం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయని తెలిపారు.

‘మీకు చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించవద్దు’ అని విజ్ఞప్తి చేశారు. ఇప్పటిదాకా కేవలం 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, ఇంకా 40 శాతం పనులు చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లాలో మరో 4 లక్షల కొత్త ఆయకట్టు పెంచుతున్నామన్నారు. జీఓ 123 ప్రకారం రైతులకు రెట్టింపు పరిహారం ఇస్తున్నామని, భూ సేకరణ అడ్డుకుని జిల్లా ప్రజల నోట్లో మన్ను కొట్టవద్దని హితవు పలికారు. ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాల్‌రాజు, మర్రి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment