తాజా వార్తలు

Saturday, 18 June 2016

మంత్రి నోట.. మళ్లీ అదే మాట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మళ్లీ అలాగే మాట్లాడారు. ముద్రగడ దీక్ష విషయంలో ఆయనను అనుమానించేలా, ఆయన నిజాయితీని అవమానించేలా మంత్రులు మాట్లాడటం తగదని ఒకవైపు కాపు ప్రముఖులు అందరూ చెబుతున్నా.. ఆయన మాత్రం మళ్లీ అదే పద్ధతిలో మాట్లాడారు. పదోరోజు నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కామినేని అన్నారు.
మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, ముద్రగడ పద్మనాభం దీక్షను ఎద్దేవా చేశాలా వాళ్ల వ్యాఖ్యలు ఉంటున్నాయని దాసరి నారాయణరావు, చిరంజీవి తదితరులు ఇంతకుముందు విమర్శించారు. మంత్రులు ఇలా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస‍్తే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని కూడా అన్నారు. అయినా మళ్లీ ఇదే తరహా వ్యాఖ్యలు వస‍్తుండటం గమనార్హం.
« PREV
NEXT »

No comments

Post a Comment