తాజా వార్తలు

Monday, 20 June 2016

గ్రేటర్‌ అభివృద్ధికి సలహాలు ఇవ్వండి…

హైదరాబాద్‌లో రోడ్ల నిర్మాణం,నిర్వాహణ పద్దుతుల్లో మార్పులు తెస్తామన్నారు మంత్రి కేటీఆర్. యూనిఫైడ్‌ మెట్రో ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీని బలోపేతం చేస్తామని చెప్పారు. స్టాండర్డ్‌ రేట్ ప్రకారం బలమైన కంపెనీకి పనులు ఇస్తామని దశలవారీగా చెల్లింపులు చేస్తామని వెల్లడించారు. జీహెచ్‌ఏంసీలో ఇన్నోవేషన్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తామని..ఎవరైనా సలహాలు సూచనులు ఇవ్వొచ్చని చెప్పారు.
జీహెచ్‌ఎంసీ అభివృద్ధిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్‌… ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్‌రెడ్డితో పాటు ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ఐదు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు కేటీఆర్‌… జీహెచ్‌ఎంసీలో అంతర్గత మార్పులపై చర్చించామన్నారు. చట్టాలు మార్చి అయినా జీహెచ్‌ఎంసీలో మార్పులు తీసుకువస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను 30 యూనిట్లుగా విభజిస్తామని పేర్కొన్నారు కేటీఆర్‌.
రోడ్ల పరిస్థితులపై చాలా మంది నుంచి సూచనలు, సలహాలు ఇచ్చారని తెలిపారు కేటీఆర్‌. హైదరాబాద్‌లో రోడ్ల నిర్వహణ బాధ్యతను ప్రత్యేక సంస్థకు అప్పగిస్తామన్నారు. రోడ్ల నిర్వహణ కోసం అవసరమైతే టెండర్ నిబంధనలు మారుస్తామని ప్రకటించారు. అభివృద్ధిపై చీఫ్ ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. కమిటీ సూచనల మేరకు రోడ్ల నిర్వహణ బాధ్యతలు ఏజెన్సీలకు అప్పగిస్తాం. నాణ్యతతో కూడిన రోడ్ల నిర్వహణ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు కేటీఆర్‌
ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలవకుండా ఉండేందుకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ చర్యలు తీసుకుంటుందన్నారు. రోడ్ల మరమ్మతు, చెత్త నిర్వహణపై త్వరలోనే యాప్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు మంత్రి కేటీఆర్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment