తాజా వార్తలు

Monday, 20 June 2016

సమన్వయంతో పనిచేయండి…

హైదరాబాద్‌ నగరంలో రోడ్ల దుస్థితిపై మంత్రి కేటీఆర్‌ మరోసారి అసహనం వ్యక్తం చేసారు. నగరంలో సమస్యలపై నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌లో ఆయన అధికారులకు క్లాస్‌ పీకారు… ఒకరు రోడ్లు వేస్తే మరొకరు తవ్వేస్తారని… అధికారుల సమన్వయంతో కోట్ల ప్రజాధనం వృధా అవుతోందన్నారు.
చిన్న వర్షాలకే రోడ్లు చెరువుల్లా మారుతున్నాయన్నారు. ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చకపోతే ఎలా అని ప్రశ్నించారు కేటీఆర్‌. కోటిమందికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరాన్ని అందరికీ నివాసయోగ్యమైన నగరంగా మార్చాలని అధికారులకు సూచించారు. మూస విధానాలకు అధికారులు స్వస్తి పలకాలన్నారు కేటీఆర్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment