తాజా వార్తలు

Friday, 3 June 2016

స్పెల్లింగులు సరిగా రావు గానీ...

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేసిన ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌పై రాష్ట్ర ఐటీ, మునిసిపల్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి నుంచే ఈ వ్యవహారంపై ట్వీట్ చేశారు. ఒకవైపు పేదలు చనిపోతుంటే నీరో చక్రవర్తిలా వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రకటనలు ఇవ్వడమేంటని దిగ్విజయ్ కేసీఆర్‌ను విమర్శించారు.

అయితే అందులో 'తెలంగాణ' పదం స్పెల్లింగును ఆయన తప్పుగా రాశారు. తెలంగాణ అనే పదంలో ఎల్ అక్షరం తర్వాత.. 'ఎ' బదులు 'ఇ' అనే అక్షరాన్ని (Telengana) ఆయన వాడారు. ఆ విషయాన్నే కేటీఆర్ ఎత్తిచూపారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉండి తెలంగాణ స్పెల్లింగు కూడా సరిగా చేతకాని వ్యక్తి.. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు చేయడమేంటని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment