తాజా వార్తలు

Tuesday, 14 June 2016

తెరపైకి మాజీ ప్రధాని జీవిత చరిత్ర…

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ఓ సినిమా రూపొందబోతోంది. ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌: ది మేకింగ్‌ అండ్‌ అన్‌మేకింగ్‌ ఆఫ్‌ మన్మోహన్‌సింగ్‌’ పేరిట సంజయ్‌బారు రాసిన వివాదాస్పద పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలు ప్రధాన పాత్రలకు ఎంపిక జరుగుతోంది. కాగా పంజాబ్‌కు చెందిన ఓ యువ నటుడు మన్మోహన్ పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 12కు పైగా భాషల్లో దీన్ని విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తుంది. అందుకే వీలైనంత తొందరగా సినిమాను ప్రారంభించి ఆగష్టు 30లోగా చిత్ర టీజర్‌ ను, 2017 చివరికల్లా సినిమాను విడుదల చేయాలని వారు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే అతడి జీవిత చరిత్రపై రాసిన పుస్తకం వివాదాస్పదమవ్వగా, ఇక ఈ సినిమా మరిన్ని వివాదాలను, అలజడిలను సృష్టిస్తుందో చూడాలి.
« PREV
NEXT »

No comments

Post a Comment