తాజా వార్తలు

Saturday, 11 June 2016

అరెస్ట్‌లపై చిరంజీవి అసంతృప్తి…

ఏపీ సీఎంచంద్రబాబుకు కాంగ్రెస్‌పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి లేఖ రాశారు. ముద్రగడ పద్మనాభం అరెస్టును ఖండిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు చిరంజీవి. కాపుల పట్ల ప్రభుత్వం ఏకపక్ష వైఖరి అనరిస్తోందని తెలిపారు. తుని ఘటనలో అరెస్టులపైనా తన అసంతృప్తి వ్యక్తం చేశారు చిరంజీవి.
కాపు ఉద్యమనేత ముద్రగడ దీక్షపట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరు సరికాదన్నారు చిరంజీవి. సున్నితమైన సామాజిక సమస్యల పరిష్కారంలో రాజకీయ పరిణితిలేకుండా కక్షగట్టినట్టు వ్యవహరించడం తగదని హితవు పలికారు చిరంజీవి. ముద్రగడ దీక్షకు రాజకీయాలతో ముడిపెట్టి సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
తుని ఘటనలో అరెస్ట్‌లపై తన అసంతృప్తి వ్యక్తం చేసిన చిరంజీవి… తుని ఘటన పేరుతో ఏకపక్షంగా అరెస్ట్‌లు చేస్తున్నారని ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, బీసీ సబ్‌ప్లాన్‌ సమస్యను పరిష్కరించాలని లేఖలో డిమాండ్‌ చేశారు చిరంజీవి.
« PREV
NEXT »

No comments

Post a Comment